- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
KKR vs RCB : నరైన్ హిట్ వికెట్ కాదా?.. బ్యాటు స్టంప్స్‌కు తాకినా అంపైర్ ఎందుకు అవుట్ ఇవ్వలేదంటే?

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో సునీల్ నరైన్‌ను హిట్ వికెట్‌గా అవుట్ ఇవ్వకపోవడం చర్చకు దారితీసింది. రూల్ ప్రకారం అతను నాటౌటే. అసలేం జరిగిందంటే..కోల్‌కతా ఇన్నింగ్స్‌లో రసిఖ్ సలామ్ వేసిన 8వ ఓవర్‌లో 4 బంతిని భారీ బౌన్సర్ వేశాడు. దాని ఆడేందుకు చూసిన నరైన్ తలపై నుంచి వెళ్లడంతో వదిలివేశాడు. ఆ బంతిని లెగ్ అంపైర్ వైడ్ ఇచ్చాడు. అయితే, నరైన్ బ్యాట్‌ను దించే క్రమంలో వికెట్లకు తాకి స్టంప్స్ కిందపడ్డాయి. మొదట దీన్ని ఎవరూ గుర్తించలేదు. టిమ్ డేవిడ్ గమనించి అప్పీలు చేశాడు. కానీ, అంపైర్ స్పందించలేదు. మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) రూల్ ప్రకారం.. నరైన్ నాటౌటే. హిట్ వికెట్ రూల్ ప్రకారం.. బ్యాటర్ బంతిని బాదడానికి ప్రయత్నించిప్పుడు మాత్రమే హిట్ వికెట్‌గా పరిగణిస్తారు. కానీ, ఇక్కడ నరైన్ బంతిని కొట్టడానికి చూడలేదు. ఒకవేళ ప్రయత్నించి ఉంటే అది వైడ్ అయినప్పటికీ నరైన్ హిట్‌వికెట్‌గా అవుటయ్యేవాడు.