దారుణం.. చిన్నారిని బలితీసుకున్న హీటర్‌

by Sridhar Babu |
దారుణం.. చిన్నారిని బలితీసుకున్న హీటర్‌
X

దిశ, జవహర్ నగర్ : హీటర్‌ షాక్‌ తగలడంతో ఓ బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే బాలాజీనగర్ లోని మార్కెట్ లేన్, హనుమాన్ టెంపుల్ సమీపంలో నివాసం ఉంటున్న శ్రీకటి నర్సింహ, సుమలత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈనెల 23న ఉదయం సుమలత తల్లి పుల్లమ్మ సుమలత చిన్న కుమారుడు బన్నీ (4) తో కలిసి సమీపంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది.

అదే సమయంలో ఆ ఇంట్లో హీటర్ ఉపయోగించి నీటిని వేడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆడుకుంటున్న బన్నీ అనుకోకుండా వేడి నీటి బాకెట్ కు తగిలి పడిపోయాడు. అప్పటికే నీరు బాగా మసిలిపోతున్నారు. ఈ వేడి నీళ్లు మీదపడి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం అతన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న బన్నీ మృతి చెందినట్లు మంగళవారం డ్యూటీ వైద్యులు ధ్రువీకరించారు.

Advertisement
Next Story

Most Viewed