రిషబ్ పంత్ పై కోపం.. టీవీ పగులగొట్టిన ప్యానెలిస్ట్!

by Veldandi saikiran |
రిషబ్ పంత్ పై కోపం.. టీవీ పగులగొట్టిన ప్యానెలిస్ట్!
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో.. ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. లక్నో ( Lucknow ) జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పై ( Rishabh Pant ) కోపంతో ఓ ప్యానలిస్టు టీవీ పగలగొట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో రిషబ్ పంత్ సరిగ్గా కెప్టెన్సీ చేయడం లేదని ఆగ్రహంతో ఊగిపోయి.. పక్కనే ఉన్న టీవీ ఇబ్బందులు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉప్పల్ వేదికగా గురువారం రోజున సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో ( Sunrisers Hyderabad vs Lucknow ) మధ్య మ్యాచ్ జరిగింది.


ఈ మ్యాచ్ లో లక్నో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే.. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్... నిన్నటి మ్యాచ్ లో బాగా ఆడలేదని... బాలాజీ ( Balaji ) అనే ప్యానలిస్టు రెచ్చిపోయాడు. స్పోర్ట్స్ తక్ నిర్వహించిన క్రీడా చర్చలో... రిషబ్ పంత్ పై కోపంతో... అక్కడే ఉన్న టీవీ పగలగొట్టాడు బాలాజీ. ఇలాంటి చెత్త కెప్టెన్ లక్నోకు అవసరం లేదంటూ... ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడి పై నమ్మకం పెట్టుకొని... మ్యాచ్ ఆడితే గంగలో కలిసినట్లే అని... నిప్పులు చెరిగాడు. అలాంటి చెత్త కెప్టెన్ ను పెట్టుకొని ఎలా క్రికెట్ ఆడదామని నిలదీశాడు బాలాజీ. ఇది ఇలా ఉండగా గురువారం జరిగిన సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో మధ్య జరిగిన మ్యాచ్ లో LSG ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2024 సంవత్సరంలో.. జరిగిన అవమానానికి నిన్నటి రోజున లక్నో ప్రతీకారం తీర్చుకుంది.




Next Story

Most Viewed