- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Chhattisgarh : ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్.. భారీగా మావోల లొంగుబాటు

దిశ, వెబ్ డెస్క్ : "ఆపరేషన్ కగార్"(Operation Kagar) ఎఫెక్ట్ తో ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని బీజాపూర్(Beejapur) లో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు(Mao's surrender). 24 మంది మావోయిస్టులు సోమవారం బీజాపూర్ పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిలో 14 మంది మావోయిస్టులపై మొత్తం రూ. 28.50 లక్షల రివార్డ్ ఉంది. కాగా 2025 జనవరి 1 నుండి, బీజాపూర్ జిల్లాలో వివిధ ఘటనల్లో పాల్గొన్న 213 మంది మావోయిస్టులు అరెస్టు కాగా, 203 మంది లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ పునరావాస విధానం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amith Sha) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "నక్సల్ ముక్త భారత్"(Naksals Mukt Bharat)లో భాగంగా నక్సల్స్ భారీగా లొంగిపోతున్నారు.
2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంగా 'ఆపరేషన్ కగార్' ను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈరోజు లొంగిపోయిన మావోయిస్టులో పలువురిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ సంఘటన మావోయిస్టుల పట్ల కేంద్రం కఠిన వైఖరి, బస్తర్ ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ కృషిలో ముఖ్యమైన అడుగుగా అధికారులు తెలిపారు.