Srihari: దయచేసి మొక్కుతా.. పిల్లలతో రాజకీయాలేంటి?: ఎమ్మెల్యే శ్రీహరి

by Prasad Jukanti |
Srihari: దయచేసి మొక్కుతా.. పిల్లలతో రాజకీయాలేంటి?: ఎమ్మెల్యే శ్రీహరి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ విద్యార్థులను ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజ్ (MLA Srihari) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దయచేసి మొక్కుతా.. పిల్లలతో రాజకీయాలు వద్దు. చేతనైతే మనం సేవ చేద్దాం. అంతే తప్ప పిల్లలతో రాజకీయాలేంటి?’ అని బీఆర్ఎస్ పై (BRS) మండిపడ్డారు. తన నియోజకవర్గంలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై ఇవాళ శాసనసభలో బీఆర్ఎస్ (BRS) సభ్యులు ప్రస్తాచగా శ్రీహరి స్పందించారు. ఆ ఘటన జరిగిన వెంటనే స్కూల్ వద్దకు హుటాహుటీనా వెళ్లామని విద్యార్థులను ఆసుపత్రికి తరలించామన్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులు రాజకీయాల కోసం విద్యార్థులతో ఫోటోలు దిగి వాటిని పత్రికల్లో వెయించి రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మా సొంత జేబు నుంచి ఖర్చు చేసి విద్యార్థులకు సాయం చేస్తున్నాం. విద్యార్థులకు ఏం చేయగలమో అది చేస్తున్నాం. ఈ 13 నెలల్లో నేను దాదాపు 78 పాఠశాలల్లో భోజనం చేశాను. దాదాపు 6 గురుకులాల్లో నిద్ర చేశాను. మధ్యాహ్నం పూట ఎక్కడ కార్యక్రమం చేస్తే అక్కడ పిల్లలతో భోజనం (Mid day meal) చేస్తున్నానన్నారు. కేవలం వార్తల్లో ప్రచారం కోసం బీఆర్ఎస్ విద్యార్థుల భోజనంపై రాద్ధాంతం చేస్తోందని దుయ్యబట్టారు. విద్యార్థులతో ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఎవరైతే ఏంటి అనేలా మాట్లాడించి వీడియోలు పోస్టు చేశారని మండిపడ్డారు. ఇదా మనం చేయాల్సిందని ప్రశ్నించారు.

Advertisement
Next Story

Most Viewed