- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Lava: లావా నుంచి అదిరే అప్డేట్.. ఐఫోన్ -16 ప్రో డిజైన్ లుక్ తో ఎంట్రి లెవెల్ ఫోన్

దిశ, వెబ్ డెస్క్: Lava: దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీదారు సంస్థ అయిన లావా..ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ల కోసం షార్క్ పేరుతో కొత్త సిరీస్ ను ప్రకటించింది. ఈ బ్రాండ్ కింద రూ. 9వేల లోపు ఫోన్లు తీసుకురానుంది. ఇందులో భాగంగా షార్క్ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ మంగళవారం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ధరను రూ. 6,999గా నిర్ణయించింది. కానీ ఇది 4జీ స్మార్ట్ ఫోన్. తొలిసారి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేవారిని ద్రుష్టిలో ఉంచుకుని ఈ ఫోన్ తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. బ్యాక్ సైడ్ కెమెరా బంప్ చూస్తే అచ్చం యాపిల్ ఐఫోన్ 16 ప్రోను పోలి ఉంటుంది.
లావా షార్క్ లో 6.67అంగుళాల హెచ్డీ ప్లస్ పంచ్ హోల్ డిస్ప్లే ఇచ్చారు. ఇది 120 హెచ్ జడ్ రిఫ్రెష్ రేటుకు సపోర్ట్ చేస్తుంది. ఫేస్ అన్ లాక్ తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. బాక్సుతోపాటు ఛార్జర్ ను ఇస్తున్నారు. లావా షార్క్ లో యూనిసోక్ టీ 606 ఆక్టాకోర్ ప్రాసెసర్ ను అమర్చారు. 4జీబీ ర్యామ్ తోపాటు 4జీబీ వర్చువల్ ర్యామ్ తో 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. 256 జీబీ వరకు ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు.
ఔటాఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14తో ఈ ఫోన్ రన్ అవుతుంది. అప్ డేట్స్ కు సంబంధించి వివరాలు కంపెనీ ఇంకా వెల్లడించలేదు. బ్యాక్ సైడ్ 50మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఏఐ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, ప్రో మోడ్, హెచ్ డీఆర్ ఎన్ హ్యాన్స్ ఫొటోగ్రఫీ ఎక్స్ పీరియన్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. టైటానియం గోల్డ్, స్టెల్త్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. లావా రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ లభిస్తుంది. త్వరలో మరిన్ని ఫోన్లు ఈ సిరీస్ లో తీసురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది.