- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tesla Vs Byd: మస్క్ మావకు బిగ్ షాక్.. అమ్మకాల్లో టెస్లాను దాటవేసిన బీవైడీ

దిశ, వెబ్ డెస్క్: Tesla Vs Byd: చైనా కార్ల తయారీదారు సంస్థ బీవైడీ నుంచి అమెరికాకు చెందిన టెస్లాకు తీవ్ర పోటీ వస్తోంది. తాజాగా వార్షిక ఆదాయాల్లో మాస్క్ నేత్రుత్వంలోని సంస్థను మించిపోయింది. షెంజెన్ కేంద్రంగా పనిచేసే బీవైడీ గత ఏడాది 107 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించినట్లు పేర్కొంది. అంతకుముందు సంవత్సంతో పోలిస్తే ఇది 29శాతం అధికం. ఇక ఇదేకాలంలో టెస్లాకు వచ్చిన ఆదాయం 97.7 బిలియన్ డాలర్లు. బీవైడీ విక్రయాల్లో హైబ్రీడ్ వాహనాల జోరు కొనసాగుతోంది.
బీవైడీ గత ఏడాది టెస్లా విక్రయించిన విద్యుత్తు వాహనాల సంఖ్యకు దాదాపు సమానంగా 17.6 లక్షల వాహనాలను అమ్మింది. కానీ దీనిలో హైబ్రిడ్ వాహనాల విభాగంలో మాత్రమే భారీగా పెరుగుదలను నమోదు చేసింది. ఈ సారి ఆ కంపెనీ ఏకంగా 43 లక్షల వాహనాలను ప్రపంచవ్యాప్తంగా విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. క్విన్ ఎల్ గా పిలిచే ఈ కారు ధర టెస్లా మోడల్ 3లో దాదాపు సగమే ఉంది.
ఇటీవలే ఈ చైనా సంస్థ టెస్లా మోడల్ 3కి పోటీగా ఓ చౌక మోడల్ కారును తీసుకవచ్చింది. చైనా ఈవీ మార్కెట్లో దూసుకెళ్లేందుకు వీలుగా దీనిని తీసుకువచ్చినట్లు సమాచారం. దీంతోపాటు బీవైడీ ఈ ఏడాది సరికొత్తగా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలను ముందుకు తీసుకువచ్చింది. కేవలం 5 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 400 కిలోమీటర్లు దూసుకుపోవచ్చు. అదే సమయంలో టెస్లాలో 15నిమిషాలు ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. ఇక బీవైడీ బేసిక్ మోడల్స్ లో కూడా ఫ్రీగా సరికొత్త డ్రైవర్ అసిస్టెన్స్ ను సిద్ధం చేసింది. దీనికి గాడ్స్ ఐ అని పేరు పెట్టారు.
గత కొద్దికాలంగా టెస్లా సారథి మస్క్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సన్నిహిత సంబంధాలు నెరపడంతో కూడా ఈ కంపెనీ కార్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. మరోవైపు చైనా తయారీకార్లపై పశ్చిమదేశాల్లో భారీగా పన్నులు విధిస్తున్నారు.