- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Pavan Kalyan: సొంత నియోజకవర్గంపై డిప్యూటీ సీఎం పవన్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు

దిశ, వెబ్‌డెస్క్: నిత్యం శాఖాపరమైన సమావేశాలు, రివ్యూలు.. మరోవైపు మూవీ షూటింగ్ (Movie Shooting)లో బిజీగా ఉంటున్న డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ (Deputy CM Pavan Kalyan) సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఆయన అన్ని శాఖల పనులపై వరుసగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మరోసారి నియోజకవర్గంలో పర్యటించి పిఠాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (Pithapuram Urban Development Authority) అధికారులతో కొనసాగుతోన్న అభివృద్ధి పనులపై సమీక్షించి అధికారులకు కూడా కీలక సూచనలు చేయనున్నారు.
నియోజకవర్గ పరిధిలోని మొత్తం నాలుగు పోలీస్ స్టేషన్లలో ఉన్న పరిస్థితిపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఇంటలిజెన్స్ (Intelligence) అధికారులను ఆదేశించనున్నారు. నియోజవర్గ పరిధిలో పోలీసులు అవినీతికి పాల్పడుతున్నారంటూ పెద్ద ఎత్తున వినతులు వెల్లువెత్తుతుండటంతో సదరు అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా వేసవిలో ఎక్కడా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా.. సమ్మర్ స్టోరేజీ ట్యాంక్స్ (Summer storage Tanks) దగ్గర తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అమృత్ 2.0 (Amrit 2.0) ద్వారా పిఠాపురం పట్టణంలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఇప్పటికే పురపాలక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.