Gopichand Malineni: ‘జాట్’ ట్రైలర్ రిలీజ్.. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉందంటూ గోపీచంద్ పోస్ట్

by sudharani |
Gopichand Malineni: ‘జాట్’ ట్రైలర్ రిలీజ్.. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉందంటూ గోపీచంద్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ (Bollywood) లెజెండ్ సన్నీ డియోల్ (Sunny Deol), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘జాట్’ (Jaat). మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై డైనమిక్ ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఉన్న ఈ ట్రైలర్ (Trailer) ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతూ విశేష స్పందన దక్కించుకుంటోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తన సోషల్ మీడియా అకౌంట్ X వేదికగా స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు.

‘యాక్షన్ సూపర్ స్టార్ సన్నీ డియోల్‌పై ముంబై అండ్ జైపూర్‌లోని అభిమానులు చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్‌(Love and support)ను చూసి నేను మా చిత్ర బృందం పూర్తిగా ఆశ్చర్యపోయాము. జాట్ ట్రైలర్‌కి ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ రెండింటిలోనూ ఈ అద్భుతమైన స్పందన నిజంగా ఊహించలేదు. దీంతో ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను.. ఈ వేసవిలో, మేము ఒక మాస్ విందును అందించడానికి సిద్ధంగా ఉన్నాము!’ అనే క్యాప్షన్ ఇచ్చి పలు ఫొటోలు షేర్ చేశాడు. ప్రజెంట్ ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాగా.. ‘జాట్’ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచి రికార్డు స్థాయి వ్యూస్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10, 2025న గ్రాండ్‌గా థియేటర్‌లలో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంలో.. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కాసాండ్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
Next Story

Most Viewed