- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఓటీటీలోకి వచ్చేసిన నాలుగు సినిమాలు.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే..?

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఓటీటీ(OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓటీటీలో నాలుగు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి వాటి డిటైల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
* టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan), రీతూ వర్మ(Ritu Varma) కాంబోలో తెరకెక్కిన 'మజాకా'(Mazaka) సినిమా నేటి నుంచి జీ5(Z5)లో స్ట్రీమింగ్ అవుతోంది.
* షాహిద్ కపూర్(Shahid Kapoor), పూజా హెగ్డే(Pooja Hegde) కాంబోలో తెరకెక్కిన 'దేవ'(Deva) సినిమా నెట్‌ఫ్లిక్స్(Netflix)లోకి వచ్చేసింది.
* ఆది పినిశెట్టి(Adipini Shetty) హీరోగా నటించిన 'శబ్దం'(Shabdam) సినిమా అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో స్ట్రీమింగ్ అవుతోంది.
* తమిళ నటుడు జీవా(Jeeva) నటించిన 'అగత్యా'(Agathya) సన్ నెక్ట్స్(Sun next)లో విడుదలైంది.