దరిద్రం అంటే ఇదే.. 200 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన హీరోయిన్ ?

by Veldandi saikiran |   ( Updated:2025-03-28 04:01:25.0  )
దరిద్రం అంటే ఇదే.. 200 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన హీరోయిన్ ?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లు ఉన్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో సమంత ( Samantha ) ఒకరు. హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏం మాయ చేసావే సినిమాతో ( Ye Maya Chesave Movie)... టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన సమంత... ఇప్పటికి కూడా టాప్ మోస్ట్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అయితే అలాంటి హీరోయిన్ సమంత పర్సనల్ విషయంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య దూరమయ్యాడు. విడాకుల తర్వాత ఆమె అనారోగ్యం పాలయ్యారు.


నాగచైతన్య ( Naga Chaitanya ) రెండో పెళ్లి చేసుకోవడంతో సమంత కూడా డిప్రెషన్ లోకి వెళ్లారట. ఇలాంటి నేపథ్యంలో హీరోయిన్ సమంత గురించి ఓ సంచలన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోయిన్ సమంత ఏకంగా 200 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేశారట. అక్కినేని నాగచైతన్య తో విడాకులు ఖరారు అయిపోయిన తర్వాత... దాదాపు 200 కోట్ల భరణం సమంతకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందట అక్కినేని కుటుంబం. ఇందులో ఇల్లు, ఖరీదైన ఆభరణాలు, ఆస్తులు, షేర్లు, డబ్బు ఉన్నాయట. అలా మొత్తం 200 కోట్ల ఆస్తులను సమంతకు ఇచ్చేందుకు అక్కినేని కుటుంబం ( Akkineni Family ) నిర్ణయం తీసుకుందట. కానీ ఆ 200 కోట్ల ఆఫర్లు సమంతా రిజెక్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గతంలో జరిగిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Read More..

నువ్వు చాలా లావుగా ఉన్నావు అని హేళన చేసేవారు.. దాని వల్ల డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయా.. ఎన్టీఆర్ భార్య ఎమోషనల్ కా...

Next Story

Most Viewed