- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Hydra-GHMC : హైడ్రా- జీహెచ్ఎంసీల కీలక నిర్ణయం

దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా, జీహెచ్ఎంసీ(Hydra-GHMC) కమిషనర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో జరిగే అగ్ని ప్రమాదాలుFire Accidents), వానాకాలంలో వరద ముప్పు(Floods)పై దృష్టి పెట్టాయి. ఈ రెండు సమస్యలపై కలిసి సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissionor AV Ranganath), జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలాంబరితి(GHMC Commisssionor Ilambarithi) మంగళవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమావేశమయ్యి.. పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో అగ్నిప్రమాదల నివారణపై, వరద ముప్పు నివారణకు రెండు ప్రత్యేక కమిటీల(Special Committees)ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటన జారీ చేశారు. ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులతో ఈ కమిటీలు ఏర్పాటు కానున్నట్టు సమాచారం. ఈ కమిటీలు నగరంలోజరిగే అగ్నిప్రమాదాల నివారణకు, వర్షాకాలంలో సంభవించే వరద ముప్పు నివారణ, ట్రాఫిక్ నియంత్రణకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. కాగా ఈ కమిటీలపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.