- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRAI: ఇకపై కాల్స్, మెసేజ్‌ల కోసం మాత్రమే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా డేటా ఉపయోగించని కస్టమర్ల కోసం వాయిస్ కాల్స్, మెసేజ్‌ల కోసం మాత్రమే ప్రత్యేక ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం కంపెనీలకు స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం టారిఫ్ నిబంధనలను సవరించింది. ఈ నిర్ణయం వల్ల ఉపయోగించిన సేవలకు మాత్రమే చెల్లింపులు చేసే సౌకర్యం సబ్‌స్క్రైబర్లకు ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి, ఫీచర్ ఫోన్ యూజర్లు, వృద్ధులకు ప్రయోజనకరంగా ఉంటుందని ట్రాయ్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుత టెలికాం కంపెనీలు వాయిస్ కాల్స్‌తో పాటు మెసేజ్‌లతో పాటు డేటాతో కూడిన ప్లాన్‌లను ఇస్తున్నాయి. దీనివల్ల కస్టమర్లు నెలకు కనీసం రూ. 200 చెల్లిస్తున్నారు. దీనివల్ల ఫీచర్ ఫోన్ మాత్రమే వాడుతున్న వారికి డేటా అవసరం లేకపోయినా రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. అంతేకాకుండా రెండు సిమ్ కార్డులను వాడుతున్న వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అవసరం లేకపోయినా నంబర్ యాక్టివ్‌గా ఉంచడం డేటాతో కూడిన ప్లాన్ ఎంచుకోవాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు తాజా ఆదేశాలు పనికొస్తాయని ట్రాయ్ ఆశిస్తోంది. పైగా ట్రాయ్ ఆదేశాలతో తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో పాటు ఈ స్పెషల్ రీఛార్జ్ కూపన్‌ల 90 రోజుల పరిమితిని తొలగిస్తూ, దాన్ని 365 రోజులకు పొడిగించింది. తద్వారా పదేపదే రీఛార్జ్ చేసుకునే సమస్య ఉండదని ట్రాప్ వెల్లడించింది.