Viral video : ఏఐతో ఏందయ్యా ఇది..! నువ్వే ఒక మర మనిషివంటే.. మళ్లీ నీకో తోక!!

by Javid Pasha |   ( Updated:2025-04-26 07:11:02.0  )
Viral video : ఏఐతో ఏందయ్యా ఇది..! నువ్వే ఒక మర మనిషివంటే.. మళ్లీ నీకో తోక!!
X

దిశ, ఫీచర్స్ : ఏ సోషల్ మీడియా వేదికలో చూసినా ఏఐ (A.I) గురించే మాట్లాడుకుంటున్నారు ఎక్కువ మంది. పైగా రకరకాల హ్యూమనాయిడ్ రోబోట్స్ (Humanoid Robot)వైరల్ అవుతున్నాయి. వెరైటీ స్టంట్లతో, పనులతో నెటిజన్లను ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ కోవకు చెందిన మరో వీడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

మర మనుషులకు, నిజమైన మానవులకు మధ్య అనుబంధం పెరిగిపోతోందా? ఏఐ టెక్నాలజీ (AI technology) ప్రవేశం తర్వాత అలాగే అనిపిస్తోంది అంటున్నారు నిపుణులు సైతం. ఎందుకంటే ఆధునిక సాంకేతికత అభివృద్ధిలో, ఆవిష్కరణలో భాగమవుతోంది. మానవులకు నాలెడ్జ్, సౌకర్యంతోపాటు ఎంటర్టైన్మెంట్ పరంగానూ యూజ్ అవుతోంది.

తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతున్న ఓ వీడియో (A video is going viral on social media) నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అందులోని వివరాల ప్రకారం.. అది చైనా దేశంలోని షెన్‌జెన్ (Shenz) సిటీలో గల పెద్ద షాపింగ్ మాల్. అయితే ఇక్కడ మనుషులతో పాటు ఓ రోబో కూడా షాపింగ్‌కు వచ్చింది. పైగా అది తన వెంట మరో డాగీ రోబోను కూడా తెచ్చుకుంది. తిరిగి వెళ్లే క్రమంలో కారు పార్కింగ్ ప్లేస్‌లోకి వచ్చిన ఆ రోబో, అక్కడ అచ్చం మనుషి మాదిరిగానే అటూ ఇటూ చూస్తూ, వాహనాల రాకను గమనిస్తూ ముందుకు వెళ్తోంది. ప్రజెంట్ ఈ వీడియో వైరల్ అవుతుండగా.. ‘నున్వే మరమనిషివంటే.. పైగా నీకో తోక కూడానా?!’ అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఆలస్యమెందుకు మీరూ చూసేయండి.



Next Story

Most Viewed