CISF: భద్రతా చర్యల్లో ఎలాంటి లోపం లేదు.. పార్లమెంట్‌లో ఘర్షణపై సీఐఎస్ఎఫ్ క్లారిటీ

by vinod kumar |
CISF: భద్రతా చర్యల్లో ఎలాంటి లోపం లేదు.. పార్లమెంట్‌లో ఘర్షణపై సీఐఎస్ఎఫ్ క్లారిటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాల సందర్బంగా ఈ నెల 19న మకర ద్వార్ వద్ద ఎంపీల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ గొడవలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి(Prathap sarangi), ముఖేష్ రాజ్‌పుత్‌(Mukesh Rajputh)లు గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యురిటీ ఫోర్స్ (CISF) క్లారిటీ ఇచ్చింది. ఎంపీల మధ్య జరిగిన వాగ్వాదం తమ వల్ల కాదని తెలిపింది. భద్రతా చర్యల్లో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేసింది. సీఐఎస్ఎఫ్ వైపు నుంచి ఎలాంటి సమస్యా లేదని సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారి శ్రీకాంత్ కిషోర్ (Srikanth kishore) తెలిపారు. ఏ ఆయుధాన్నీ లోపలకు అనుమతించలేదని వెల్లడించారు. ‘పార్లమెంట్ భద్రత కోసం మా సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. ఎంపీలు, ఇతరులు క్యాంపస్ భద్రతను మరింత మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నారు. పార్లమెంటు భద్రతే మాకు ముఖ్యం’ అని చెప్పారు. గాయపడిన ఇద్దరు బీజేపీ ఎంపీలు సారంగి, రాజ్‌పుత్‌లు సోమవారం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కొద్ది గంటల తర్వాత సీఐఎస్‌ఎఫ్ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed