- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rahul Gandhi : నూటికి నూరుపాళ్లు సూర్యవంశీది కస్టోడియల్ హత్యే : రాహుల్‌గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలోని పర్భనీ(Parbhani violence)లో ఈనెల 10న హింసాకాండ అనంతరం జ్యుడీషియల్ కస్టడీలో సోమనాథ్ సూర్యవంశీ చనిపోయిన అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సోమనాథ్ సూర్యవంశీ దళితుడు కాబట్టే హత్య చేశారు. అతడు రాజ్యాంగ పరిరక్షణ కోసం కడదాకా పోరాడాడు’’ అని రాహుల్ ఆరోపించారు. ‘‘ఆర్ఎస్ఎస్ అనే సైద్ధాంతిక భావజాలం వల్లే ఈ హత్య జరిగింది. సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన కామెంట్లే దీనికి కారణం. ఈ హత్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం రోజు పర్భనీ హింసాకాండ బాధిత కుటుంబాలను రాహుల్ పరామర్శించారు.
సోమనాథ్ సూర్యవంశీ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ‘‘పర్భనీ హింసాకాండ బాధిత కుటుంబాలను నేను కలిశాను. చనిపోయిన వారి పోస్టుమార్టం నివేదికలను చూశాను. హింసకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను చూశాను. సోమనాథ్ సూర్యవంశీది నూటికి నూరుపాళ్లు కస్టోడియల్ మరణమే’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిపై సీఎం ఫడ్నవిస్ స్పందిస్తూ.. రాజకీయ ప్రయోజనాల కోసమే పర్భనీని రాహుల్ సందర్శించారని విమర్శించారు. జ్యుడీషియల్ దర్యాప్తునకు ఆదేశించామని.. ఒకవేళ అది కస్టోడియల్ మరణమే అని తేలితే కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు.