- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth: ఆయన మృతి తీరని లోటు.. ప్రముఖ దర్శకుడి మృతి పట్ల సీఎం సంతాపం
దిశ, వెబ్ డెస్క్: శ్యామ్ బెనగల్(Shyam Benegal) మృతి(Death) సినీ ప్రపంచానికి(Film Industry) తీరని లోటు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అన్నారు. తెలుగు దర్శక దిగ్గజం శ్యామ్ బెనగల్ ఇవాళ సాయంత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఆయన మృతి పట్లవిచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం.. ప్రముఖ దర్శకుడు, నిర్మాత, రచయిత, పద్మభూషణ్ శ్యామ్ బెనగల్(Padma Bhushan Shyam Benegal) మరణం పట్ల సంతాపం(Condolences) తెలియజేశారు.
చలన చిత్ర రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన శ్యామ్ బెనగల్ మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. శ్యామ్ బెనగల్‌కి హైదరాబాద్(Hyderabad)తో ఎంతో అనుబంధం ఉందని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. అంతేగాక హైదరాబాద్‌లో జన్మించి ఇక్కడే విద్యాభ్యాసం చేసిన శ్యామ్ బెనగల్ సినీరంగంలో ఏడుసార్లు జాతీయ అవార్డులతో పాటు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకుని అత్యున్నత స్థాయికి ఎదిగారని అన్నారు. అంకుర్, నిషాంత్, మంథన్, భూమిక వంటి మేటి చిత్రాలు రూపొందించి సినీ రంగంలోనే గొప్ప మార్పులు తెచ్చారని కొనియాడారు. శ్యామ్ బెనగల్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఆయన మృతి పట్ల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని(Deepest Condolences) తెలియజేశారు.