AP: ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. ఐదు నిమిషాల వ్యవధిలో మూడు సార్లు

by Ramesh Goud |
AP: ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. ఐదు నిమిషాల వ్యవధిలో మూడు సార్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో వరుస భూ ప్రకంపనలు(Series Of Earthquakes) ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా(Prakasam district)లో ముండ్లమూరు మండలంలో(Mundlamuru mandal) గత మూడు రోజుల నుంచి భూమి స్వల్పంగా కంపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి(Monday night) సమయంలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. ఇవాళ ఉదయం 10.41 గంటలకు కంపించిన భూమి మరోసారి రాత్రి 8.15 గంటలకు, 8.16 గంటలకు, 8.19 గంటలకు వరుసగా మూడు సార్లు కంపించింది. ఐదు నిమిషాల వ్యవధిలోనే భూమి మూడు సార్లు కంపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకి పరుగులు తీశారు. మూడు రోజుల నుంచి వస్తున్న ప్రకంపణలతో పోలిస్తే.. ఈ రోజు తీవ్రత కాస్త ఎక్కవగా ఉందని చెబుతున్నారు. వరుస భూ ప్రకంపనలు సంభవిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేకుండా కేవలం ఒక్క తమ మండలంలోనే భూకంపం రావడంతో బెంబేలెత్తుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed