- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Wifes Cruelty : స్నేహితురాలు, ఫ్యామిలీని కూడా ఇంట్లో ఉంచుకోవాలి.. భర్తతో భార్య వితండవాదం.. కోర్టు కీలక తీర్పు
దిశ, నేషనల్ బ్యూరో : తన స్నేహితురాలిని, కుటుంబ సభ్యులను కూడా ఇంట్లో ఉండనివ్వాలంటూ వితండవాదం చేసిన మహిళ నుంచి భర్తకు విడాకులు మంజూరయ్యాయి. కలకత్తా హైకోర్టు(Calcutta High Court) న్యాయమూర్తులు జస్టిస్ సవ్యసాచి భట్టాచార్య, జస్టిస్ ఉదయ్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసులో విడాకుల మంజూరుకు నిరాకరిస్తూ గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు బెంచ్ తోసిపుచ్చింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఈ దంపతులకు 2005 డిసెంబరు 15న పెళ్లి జరిగింది. వీరి దాంపత్య జీవితం మూడేళ్ల పాటు సాఫీగానే సాగింది. 2008 సంవత్సరం నుంచే భార్య వేధింపులు మొదలయ్యాయి.
తన స్నేహితురాలు, తన కుటుంబ సభ్యులను కూడా ఇంట్లో ఉండనివ్వాలని భర్తను భార్య బలవంతం చేసింది. భర్త వద్దని పదేపదే వారించినా వినకుండా.. వాళ్లందరినీ తనతో పాటు ఇంట్లోనే ఉంచుకుంది. ఈక్రమంలో 2008 సంవత్సరం సెప్టెంబరు 25న పోలీసులకు భర్త ఫిర్యాదు చేశారు. దీనికి ప్రతిగా అదే ఏడాది అక్టోబరు 27న భార్య(wifes cruelty) కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘‘ఇంట్లో ఇతరులను ఉంచుకోమని చెప్పి భర్తతో భార్య క్రూరంగా ప్రవర్తించింది. తప్పుడు కేసులతో అతడిని వేధించేందుకు యత్నించింది. ఈ అంశాల ప్రాతిపదికన ఆ భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేస్తున్నాం’’ అని హైకోర్టు బెంచ్ వెల్లడించింది.