Ponnam: గురుకుల పాఠశాలలో మంత్రి పొన్నం ఆకస్మిక తనిఖీ

by Ramesh Goud |
Ponnam: గురుకుల పాఠశాలలో మంత్రి పొన్నం ఆకస్మిక తనిఖీ
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న ఘటనల నేపథ్యంలో బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Transport Minister Ponnam Prabhakar) ఆకస్మిక తనిఖీ(Surprise Inspection) నిర్వహించారు. తన సొంత నియోజకవర్గమైన హుస్నాబాద్(Husnabad) పర్యటనలో ఉన్న ఆయన.. జిల్లల్లగడ్డ(Jillallagadda)లో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను(Social Welfare Gurukul School) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి.. డైట్ చార్జీలు(Diet Charges పెంచిన తరువాత విద్యార్థులకు అందిస్తున్న మెనూ(Menu) పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం(Quality Food) అందించాలని సూచించారు. అలాగే హాస్టల్ పరిసర ప్రాంతాలలో బుష్ క్లియరెన్స్ చేయాలని అధికారులను ఆదేశించారు. హాస్టల్ వాటర్ ప్లాంట్ పరిశీలించిన ఆయన.. ఎప్పటికప్పుడు ట్యాంక్ లు శుద్ధి చేయాలని చెప్పారు. ఇక పాఠశాల గ్రౌండ్ లో ఉపయోగపడే మొక్కలు నాటాలని మునగ, జామ, మామిడి సహా పలు రకాల కూరగాయల మొక్కలు నాటాలని ప్రిన్సిపాల్‌ను మంత్రి పొన్నం ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed