- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health: వైద్య శాఖ అధికారులతో మంత్రి దామోదర్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ
దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వాసుపత్రుల్లోని(Government Hospitals) వైద్య పరికరాల(Medical Equipment) రిపేర్లను వేగవంతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా(Health Minister Damodar Rajanarsimha) అన్నారు. సోమవారం హైదరాబాదు(Hyderabad)లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయం(Rajiv Arogyasri Healthcare Trust office)లోని మీటింగ్ హాల్లో ప్రభుత్వ ఆసుపత్రులలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ (Infrastructure), హెచ్ఆర్, ఎక్విప్మెంట్(HR and Equipment) బలోపేతంపై వైద్యశాఖ హెచ్ఓడీలతో ఉన్నత స్థాయి సమీక్ష(high-level review) నిర్వహించారు. ఈ సమావేశంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. వాణి, వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ కుమార్, రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న ఎక్విప్మెంట్‌ను పూర్తిస్థాయిలో వినియోగానికి అవసరమైన హెచ్ఆర్‌ను, ల్యాబ్ టెక్నీషియన్‌ల నియామకాలపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎక్విప్మెంట్ రిపేర్లతోపాటు, ఆస్పత్రుల నిర్వహణ పై దృష్టి సారించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (IPHS) ప్రకారం మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఎక్విప్మెంట్, సిబ్బంది నియామకాలు జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇక వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలలోని అన్ని విభాగాలలో ఉన్న ప్రతి అంశంపై మంత్రి దామోదర్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.