- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇట్స్ అఫీషియల్.. RRR: బిహైండ్ అండ్ బియాండ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
దిశ, సినిమా: దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా మూవీ ‘త్రిబుల్ ఆర్’(RRR). 2022 లో రిలీజ్ అయిన ఈ సినిమా.. సూపర్ హిట్ టాక్ రావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు(Oscar Award) కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై డాక్యుమెంటరీ(Documentary) సిద్ధం చేసినట్లు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్(DVV Entertainments) అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ ట్రైలర్(Trailer) కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఆర్ ఆర్ ఆర్:బిహైండ్ అండ్ బియాండ్(RRR: Behind and Beyond) డాక్యుమెంటరీ ఓటీటీ(OTT) రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. డిసెంబర్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్(Net Flix)లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుపుతూ.. రాజమౌళి ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
https://x.com/Netflix_INSouth/status/1871148747599782266