- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Manu Bhaker : ఖేల్ రత్న నామినేషన్లలో మను బాకర్‌కు దక్కని చోటు
దిశ, స్పోర్ట్స్ : ప్యారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన మను బాకర్‌కు ఖేల్ రత్న నామినేషన్లలో చోటు దక్కనట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణ్యం నేతృత్వంలోని 12 మంది సభ్యుల కమిటీ భారత దేశ అత్యున్నత క్రీడా పురస్కారానికి మను బాకర్ పేరును సిఫార్సు చేయలేదని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మనుబాకర్ అవార్డు కోసం దరఖాస్తు చేయలేదని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే షూటర్ తండ్రి రామకృష్ణ దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌ల పేర్లను ఖేల్‌తర్న అవార్డుకు నామినేట్ చేశారు. తుది జాబితాను ఇంకా సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతోందని క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. మనుబాకర్ 2020లో అర్జున అవార్డును గెలుచుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో వైఫల్యం తర్వాత పుంజుకున్న మనుబాకర్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. అయితే ఇటీవల ప్రమోషనల్ ఈవెంట్స్‌కు ఒలింపిక్ మెడల్స్ వేసుకొని వెళ్లడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
అవార్డులు అడుక్కోవాలా..? : మనుబాకర్ తండ్రి రామకృష్ణ
ఈ అంశంపై మనుబాకర్ తండ్రి రామకృష్ణ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించినా అవార్డులను అడుక్కొవాలా అని మండిపడ్డారు. అథ్లెట్లను ప్రోత్సహించే విధానం ఇదేనా అని ప్రశ్నించారు. తాము అవార్డుకు అప్లై చేశామని అయితే కమిటీ నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఎందుకు తల్లిదండ్రులు పిల్లలను ఆటల్లో ప్రోత్సహించాలా లేదంటే.. ప్రభుత్వంలో ఐఆర్ఎస్ అధికారులు కావాలని ఒత్తిడి చేయాలా? అని ప్రశ్నించారు.