రంగరాజన్ పై వీర రాఘవ రెడ్డి సంచలన ఆరోపణలు !

by Veldandi saikiran |   ( Updated:2025-04-29 15:10:25.0  )
రంగరాజన్ పై వీర రాఘవ రెడ్డి సంచలన ఆరోపణలు !
X

దిశ, వెబ్ డెస్క్ : చిలుకూరు బాలాజీ టెంపుల్ (Chilukuru Balaji Temple) అర్చకులు రంగరాజన్ ( Rangarajan ) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్ పై వీర రాఘవ రెడ్డి ( Veera Raghava Reddy ) సంచలన ఆరోపణలు చేశారు. అర్చకులు రంగరాజన్ ఇంటికి వెళ్లినప్పుడు చేయకూడని పని చేస్తూ కనిపించారని బాంబు పేల్చారు. ఆ దృశ్యాలను కెమెరాలో రికార్డు చేశామన్నారు.

దాన్ని లాక్కునేందుకు రంగరాజన్ మాపై దాడి చేసే యత్నం చేశారని ఆగ్రహించారు. ధర్మస్థాపనకు ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధం సవాల్ విసిరారు వీర రాఘవరెడ్డి. ఇక అటు పహల్గామ్ ఉగ్రదాడిపై రామరాజ్యం వీరరాఘవరెడ్డి రియాక్టు అయ్యారు. ఫ్యాంట్లు ఇప్పి మరీ హిందువులను చంపేశారని ఆరోపణలు చేశారు. ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు ప్రతి ఊరిలో ఆలయ అర్చకులు ఓ సైనికుడిని తయారు చేసుకోవాలని పేర్కొన్నారు. 27 వేల మంది సైన్యాన్ని సిద్ధం చేసుకుంటే మన ఆలయాలు, ఆలయ భూములను కాపాడుకోవచ్చు అన్నారు వీరరాఘవరెడ్డి.

ఇది ఇలా ఉండగా.... చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పైన వీర రాఘవరెడ్డి మనుషులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన మూడు నెలల కిందట జరిగింది. అప్పుడు.. రంగరాజన్ కోసం... సీఎం రేవంత్ రెడ్డి అలాగే గులాబీ పార్టీ ( BRS) నేతలు కూడా రంగంలోకి దిగారు. సీఎం రేవంత్ రెడ్డి (CM revanth) ఆదేశాల మేరకు దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.



Next Story