- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rashmika mandanna: ‘నన్ను ఎవరైనా ఎత్తుకుంటే చాలా భయమేస్తుంది’.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప’ మూవీతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయింది. అయితే ఈ భామ రీసెంట్‌గా వచ్చిన ‘పుష్ప-2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో తన నటనతో మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు.. పీలింగ్స్ సాంగ్‌తో మాత్రం ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఈ క్రమంలో ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక పీలింగ్స్ సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఆమె మాట్లాడుతూ.. ‘సినిమా రిలీజ్ ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉందనకా మేము పీలింగ్స్ సాంగ్ షూట్ చేశాము. మొత్తం 5 రోజుల్లో ఈ పాట కంప్లీట్ చేసేశాము. అయితే అల్లు అర్జున్ గారితో డ్యాన్స్ చేస్తున్నందుకు మురిసిపోయాను. కానీ, స్టార్టింగ్ కొంచెం భయంగా, అసౌకర్యంగా అనిపించింది. సాధారణంగా నన్ను ఎవరైనా ఎత్తుకుంటే నాకు చాలా భయమేస్తుంది. పాటలో బన్నీ సర్ ఎత్తుకుని స్టెప్పేసినప్పుడు ఫుల్‌గా భయపడ్డాను కానీ ఆ తర్వాత నార్మల్‌గా అనిపించింది’ అని రష్మిక మందన్న చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ప్రస్తుతం రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’, 'ఛావా', 'రెయిన్ బో' వంటి వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది.
Read More..