Yashasvi Jaiswal : జైస్వాల్ సెహ్వాగ్ నుంచి నేర్చుకో.. : పుజారా

by Sathputhe Rajesh |
Yashasvi Jaiswal : జైస్వాల్ సెహ్వాగ్ నుంచి నేర్చుకో.. :  పుజారా
X

దిశ, స్పోర్ట్స్ : యశస్వి జైస్వాల్ సెహ్వాగ్ నుంచి నేర్చుకోవాలని భారత మాజీ క్రికెటర్ చటేశ్వర్ పుజారా అన్నాడు. ఓ టీవీ చానెల్‌తో ఆయన సోమవారం మాట్లాడారు. ‘ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో జైస్వాల్ వేగంగా పరుగులు చేయడం కోసం తొందరపడుతున్నాడు. అతను కొంత సమయాన్ని మైదానంలో కేటాయించాలి. వేగంగా పరుగులు చేయడం కోసం షాట్లు కొడుతున్నాడు. తొలి 5-10 ఓవర్లలో ఇదే ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. 15-20 పరుగులు తొందరగా చేయాలని భావిస్తున్నాడు. టెస్ట్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగితే బంతి మీదకు వెళ్లొద్దు. లూస్ బంతులనే ఆడే ప్రయత్నం చేయాలి. వీరేంద్ర సెహ్వాగ్ సైతం అగ్రెసివ్ ప్లేయర్. కానీ తన పరిధిలోకి వచ్చిన బంతులనే షాట్లు ఆడేవాడు.’ అని పుజారా అన్నాడు. జైస్వాల్ తొలి టెస్ట్‌లో 161 పరుగులు చేసి జట్టు విజయం కీలక పాత్ర పోషించాడు. తర్వాతి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు.

Advertisement

Next Story

Most Viewed