- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ORR: చెరువుల ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం
దిశ, తెలంగాణ బ్యూరో: చెరువుల ఆక్రమణలపై పూర్తిస్తాయి విచారణ చేపట్టాలని సంబంధిత శాఖాధికారులను హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఆదేశించారు. ఓఆర్ఆర్‌కు చెరువుగా ఉన్న పలు చెరువులను సోమవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. చెరువుల ఆక్రమణలపై ప్రజలతో పాటు.. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. నానక్‌రామ్‌గూడకు చేరువలో ఉన్న తౌతానికుంట, భగీరథమ్మ చెరువు, నార్సింగ్‌లోని నెక్నాంపూర్ చెరువుల ఆక్రమణలపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తౌతాని కుంట, భగీరథమ్మ చెరువుల ఆక్రమణలతో పాటు.. ఆయా చెరువల్లోకి వరద నీరు చేరకుండా కాలువలను మల్లించడం, మూసివేయడంపై రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులతో క్షుణ్నంగా పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాలని హైడ్రా అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీచేశారు.
Read More..
Harish Rao: వాళ్లందరినీ తొక్కి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు.. హరీష్ రావు హాట్ కామెంట్స్
చెరువుల్లో మట్టిపోయడంతో పాటు ఆఖరుకు వరద కాలువలను కూడా కనిపించకుండా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. మౌలాన ఆజాద్ నేషనల్ ఉర్ధూ యూనివర్సిటీ ఖాళీస్థలంలో వర్షపు నీరు వెళ్లే రహదారులు మూసుకుపోవడంతో తమ అపార్టుమెంట్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోందన్న స్థానికులు ఫిర్యాదు చేశారు. నానాక్‌రామ్‌గూడ ప్రధాన రహదారికి ఎగువున ఉన్న తౌతాని కుంట చెరువు నీరు.. దిగువవైపు ఉన్న భగీరథమ్మ చెరువుకు వెళ్లే కాలువ లింకు తెగిందన్న స్థానికులు తెలిపారు. నానక్‌రామ్‌గూడకు ఉన్న ఇరువైపులా వరదనీటి కాలువలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు, దుకాణాలను తొలగించాలని కమిషనర్ ఆదేశించారు. యూనివర్సిటీ ఖాళీ స్థలంలోంచి వరద నేరుగా తౌతాని కుంటకు, తర్వాత భగీరథమ్మ చెరువుకు చేరితే ఈ ఇబ్బంది తొలుగుతుందని స్థానికులు విజ్ఞప్తి చేశారు.
చెరువులకు ఆనుకుని ఉన్న స్థలాలు తమవంటూ పలువురు కమిషనర్‌ను కలువగా.. పూర్తి వివరాలను హైడ్రాకు సమర్పిస్తే.. క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని రంగనాథ్ చెప్పారు. గ్రామీణ మ్యాప్‌లతో పాటు.. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణ విభాగాలకు చెందిన మ్యాప్‌లతో పూర్తి స్థాయి పరిశీలన జరిపించి వారం రోజుల లోపు నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. నార్సింగ్ దగ్గర మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని కూడా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. కొన్ని నిర్మాణ సంస్థలు మూసీ నదిలోకి పోసిన మట్టిని తొలగించాలని ఆదేశించారు. బఫర్ జోన్లోకి మట్టిపొస్తే ఆయా సంస్థలపై చర్యలుంటాయని హెచ్చరించారు.