అటవీ భూముల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి ఫారెస్ట్ కమిటీ ఆమోదం : వనపర్తి కలెక్టర్

by Aamani |
అటవీ భూముల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి ఫారెస్ట్ కమిటీ ఆమోదం : వనపర్తి కలెక్టర్
X

దిశ,వనపర్తి : వనపర్తి మండల పరిధిలోని అంజనగిరి తండా, చెరువు ముందరి తండాలకు అటవీ భూముల గుండా బీటీ రోడ్లు నిర్మించేందుకు జిల్లా స్థాయి ఫారెస్ట్ కమిటీ ఆమోదించినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఫారెస్ట్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి మండల పరిధిలోని అంజనగిరి తండా, చెరువు ముందర తండాలకు అటవీ భూముల గుండా బీటీ రోడ్లు నిర్మించేందుకు జిల్లా స్థాయి ఫారెస్ట్ కమిటీ ఆమోదిస్తున్నట్లు చెప్పారు.

పంచాయతీ రోడ్డు నుంచి అంజనగిరి తండా వరకు బీటీ రోడ్డు వేసేందుకు 0.69 హెక్టార్ల భూమి, చెరువు ముందరి తండాకు వయా పెద్ద తండా రహదారికి 0.91 హెక్టార్ల అటవీ భూమి కేటాయించేందుకు కమిటీ ఆమోదం తెలిపిందని వివరించారు.ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి తిరుమల రావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి బీరం సుబ్బారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేష్, గిరిజన శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed