- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లారీ ఢీకొని మహిళ మృతి
దిశ, కూకట్పల్లి : స్కూటీపై ప్రయాణిస్తున్న మహిళను లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాలానగర్ సీఐ నరసింహరాజు తెలిపిన వివరాల ప్రకారం రాకేష్ కుమార్ జైన్ కుటుంబం బాలానగర్‌లోని ఏ2ఏ లైఫ్ స్పేస్‌లో నివాసం ఉంటున్నారు. రాకేష్ కుమార్ జైన్ భార్య సంతోష్ దేవి జైన్ (54) తన కూతురు జయంతి జైన్, మనువరాలు ఖుష్బుతో కలిసి ద్విచక్ర వాహనంపై ఫతేనగర్ వైపు వెళ్తుండగా నర్సాపూర్ కూడళిలో పిల్లర్ నంబర్ 11 వద్ద వెనక నుంచి వచ్చిన లారీ వీరి స్కూటీని ఢీకొట్టింది. దీంతో వెనక కూర్చున్న సంతోష్ దేవి జైన్ కింద పడింది. కింద పడిన ఆమె తల భాగం పైనుంచి లారీ తీసుకు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. లారీ డ్రైవర్ పి. అవినాష్(36)గా గుర్తించారు. లారీ డ్రైవర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాకేష్ జైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాకేష్ జైన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.