చేపల వలలో చిక్కిన కొండచిలువ

by Aamani |
చేపల వలలో చిక్కిన  కొండచిలువ
X

దిశ,కొల్లాపూర్ (కోడేర్): చేపల వలలో చిక్కిన కొండచిలువను అటవీశాఖ అధికారులు ఆడవిలో వదిలిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా కోడేర్ మండలం పసుపుల గట్టు సమీపంలో ఎంజీకేఎల్ఐ రిజర్వాయర్ లో జాలర్ల వలలో ఆదివారం రాత్రి భారీ కొండచిలువ చిక్కింది. బీహార్ కు చెందిన జాలర్లు రిజర్వాయర్ లో చేపల వేట కొనసాగిస్తున్నారు.

చేపలు పట్టేందుకు జలాశయంలోకి బోటులో వెళ్లారు. వలలో చిక్కిన భారీ కొండచిలువను చూసిన జాలర్లు భయంతో వణికిపోయారు. గంట పాటు శ్రమించి ఒడ్డుకు అతి కష్టం మీద చేర్చారు. పది అడుగుల పొడవు, 100 కిలోల బరువు ఉన్న కొండచిలువను జలాశయం కట్టపై తాడుతో చెట్టుకు బంధించారు. కొండచిలువ చేపల వలకు చిక్కినట్లు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారిణి ఫరీదా బేగం, ప్రొటెక్షన్ సిబ్బంది తిరుపయ్య,శివ సోమవారం చేరుకొని కొండచిలువను బుల్లోరా వాహనంలో తీసుకొని అటవీప్రాంతంలో విడిచిపెట్టారు.

Advertisement

Next Story

Most Viewed