Bashar al-Assad : బషర్-అల్-అసద్‌కు భార్య ఆస్మా విడాకులు! ఎందుకంటే.?

by Sathputhe Rajesh |
Bashar al-Assad : బషర్-అల్-అసద్‌కు భార్య ఆస్మా విడాకులు! ఎందుకంటే.?
X

దిశ, నేషనల్ బ్యూరో : సిరియా అధ్యక్షుడు బషర్-అల్-అసద్‌కు భార్య ఆస్మా విడాకులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో సోమవారం పలు కథనాలు వచ్చాయి. మాస్కోలో తను గడుపుతున్న జీవితం ఇష్టం లేకనే ఆస్మా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. లండన్‌లో సిరియా దంపతులకు ఆస్మా పుట్టారు. సిరియాతో పాటు బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నారు. 2000వ సంవత్సరంలో 25 ఏళ్లు ఉన్నప్పుడు అసద్‌ను విహహామాడారు.

మాస్కోను వీడి వెళ్లేందుకు సైతం

డైవర్స్‌తో పాటు మాస్కోను వీడి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఆస్మా విడాకుల అప్లికేషన్‌లో కోరారు. ఈ నెల మొదటి వారంలో హయత్-తెహ్రిర్-షమ్ రెబల్స్ సిరియాలోని ప్రధాన నగరాలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అసద్ కుటుంబం మాస్కోలో ఆశ్రయం పొందేందుకు ఆ దేశ ఉన్నతాధికారులు అనుమతిచ్చారు. దీంతో సిరియాలో ఐదు దశాబ్ధాలుగా పాలించిన అసద్ కుటుంబం పాలన ముగిసింది. అసద్ సోదరుడు మహెర్ అల్-అసద్‌కు రష్యా ఆశ్రయం ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రస్తుతం అతను హౌజ్ అరెస్ట్‌లో ఉన్నాడు. అసద్ 24 ఏళ్లుగగా సిరియాకు అధ్యక్షడిగా కొనసాగారు. 2000 సంవత్సరం నుంచి అసద్ సిరియా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.

భారీగా అసద్ ఆస్తులు ఫ్రీజ్

1971 నుంచి 2000 వరకు అతని తండ్రి హఫీజ్-అల్- అసద్ సిరియాకు అధ్యక్షుడిగా కొనసాగారు. తాజాగా రష్యా ఉన్నతాధికారులు భారీగా అసద్ ఆస్తులను ఫ్రీజ్ చేశారు. ఇందులో 270 కిలోల బంగారం, 2 బిలియన్ల అమెరికా డాలర్లు, 18 అపార్టెమెంట్లను ఉన్నట్లు జెరుసలేం పోస్ట్ తన కథనంలో వెల్లడించింది. రష్యాలో ఆశ్రయం పొందుతున్న అసద్ తీవ్ర ఆంక్షలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఎటువంటి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడానికి అనుమతించేది లేదని తెలిపింది.

Advertisement

Next Story