- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికే ఆదర్శం : ఎమ్మెల్యే సామేలు
దిశ,తుంగతుర్తి: ఏసుక్రీస్తు బోధన ప్రపంచ మానవాళికి ఆదర్శప్రాయంగా నిలిచిందని స్థానిక శాసన సభ్యులు మందుల సామేలు అన్నారు.నియోజకవర్గ స్థాయిలో సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటైన క్రిస్మస్ సంబరాల్లో భాగంగా ప్రేమ విందు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.సమాజంలో అశాంతి,అసమానతలకు ఏసుక్రీస్తు పరిష్కార మార్గం చూపాడని కొనియాడారు.అంతే కాకుండా ప్రపంచ మానవాళికి అద్భుతమైన సందేశాలు ఇచ్చాడని గుర్తు చేశారు.ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల పండుగలకు ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు.అనంతరం పలువురితో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. విందులో పాల్గొన్న క్రిస్టియన్ సోదరులకు భోజనాలు వడ్డించారు.కార్యక్రమంలో జడ్పీసీఈవో అప్పారావు, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి,వైస్ చైర్మన్ వెంకన్న,తహసీల్దార్ దయానందం,ఎంపీడీవో శేషు కుమార్,డీసీసీబీ డైరెక్టర్ సైదులు,కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు,తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ అనసూర్య,పార్టీ మండల అధ్యక్షుడు గోవర్ధన్ తో పాటు 8 మండలాలకు చెందిన అధికారులు,పాస్టర్లు,తదితరులు పాల్గొన్నారు.