- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Winter festivals : వరల్డ్ ఫేమస్ వింటర్ ఫెస్టివల్స్ .. ఎక్కడ ఎలా జరుపుకుంటారంటే..
దిశ, ఫీచర్స్ : వింటర్‌లో చల్లటి వెదర్ కొన్ని విషయాల్లో ఇబ్బందిగా మారినా ఈ సీజన్ అనేక విషయాల్లో అద్భుతమైందిగా చెప్తుంటారు నిపుణులు. చల్లని గాలులు, వెచ్చటి దుప్పట్లు, హాయిగా ఉండే వాతావరణం వంటివి మరుపురాని మధుర జ్ఞాపకాలను కూడా క్రియేట్ చేస్తాయి. అంతేకాకుండా ఎక్కువమొత్తంలో పండుగలు, వేడుకలకు అనువైనదిగా, బెస్ట్ హాలిడేస్ అప్రోచ్‌గా ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు అద్భుతమైన ఫెస్టివల్స్‌ను ఈ సీజన్‌లోనే జరుపుకుంటాయి. ఉత్సాహం నింపే పరేడ్స్, మిరుమిట్లు గొలిపే లైట్లు, మంచు గడ్డలపై నడకలు వంటి ఆటలు, సంప్రదాయ పద్ధతులు కూడా చూడవచ్చు. అలాగే శీతాకాలం ప్రయాణం చేయడానికి సరైన, అలాగే అనువైన సమయంగానూ పేర్కొంటారు. అయితే వరల్డ్ వైడ్‌గా ఈ కాలంలో జరుపుకునే ముఖ్యమైన పండుగులు ఏవో చూద్దాం.
సెయింట్ పాల్ వింటర్ కార్నివాల్, యూఎస్ఏ
మిన్నెసోటా(Minnesota)లో జరిగే అత్యంత ముఖ్యమైన శీతాకాలపు పండుగల్లో సెయింట్ పాల్ వింటర్ కార్నివాల్ ఒకటి. ఇది 2025 జనవరి 23 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు జరుగుతుంది. ఈ ఐకానిక్ ఫెస్టివల్ మంచు, మంచుపై పరేడ్( parades) పోటీలు, వివిధ కార్యకలాపాలతో వింటర్‌ను సెలబ్రేట్ చేసుకుంటుంది. అనేక రకాల శీతాకాలపు క్రీడలు, స్థానిక సంస్కృతిని, రుచికరమైన ఆహారపు అలవాట్లను ఆస్వాదించడానికి ఈ వింటర్ కార్నివాల్ ఫెస్టివల్ ప్రసిద్ధి చెందిన వేదికగా పేర్కొంటారు.
సపోరో స్నో ఫెస్టివల్, జపాన్
సపోరో స్నో ఫెస్టివల్ అయిన సపోరో( Sapporo)ను మంచుతో నిండిన వండర్ ల్యాండ్‌గా మారుస్తుంది. 1950లో కేవలం ఆరు శిల్పాల(six sculptures)తో ప్రారంభించిన ఈ పండుగ ప్రపంచ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సంవత్సరం ఇది ఫిబ్రవరి 4 నుంచి 2025 ఫిబ్రవరి 11 వరకు జరుగుతుంది. సందర్శకులు మంచు శిల్పాలపై తిరగాడే పోటీలు, ప్రత్యక్ష ప్రదర్శనలు, ఫుడ్ స్టాల్స్ ఇక్కడ చూడముచ్చటగా ఉంటాయి. అద్భుతమైన మంచు, ప్రకృతి దృశ్యంలో జపనీస్ కళాత్మకత (Japanese artistry) క్రియేటివిటీని ప్రదర్శిస్తుంది.
ది కార్నివాల్ ఆఫ్ వెనిస్, ఇటలీ
వెనిస్ కార్నివాల్ (The Carnival of Venice) ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన, సొగసైన(elegant) వేడుకల్లో ఒకటి. ఇది 2025 ఫిబ్రవరి 14 నుంచి మార్చి 4 వరకు జరుగుతుంది. క్లిష్టమైన ముసుగులు, విలాసవంతమైన దుస్తులు ధరించి జరుపుకునే చారిత్రాత్మక ఆకర్షణకు ప్రసిద్ధి చెందిన ఈ పండుగ, వెనిస్‌ను కలర్ అండ్ క్రియేటివిటీతో కూడిన లివింగ్ థియేటర్‌గా మారుస్తుంది. ఆర్ట్ అండ్ మిస్టరీని జరుపుకుంటుంది. ఇక ఇక్కడి సెయింట్ మార్క్స్ స్క్వేర్ అనేది హార్ట్ ఆఫ్ ఫెస్టివల్‌గా పేర్కొంటారు. వివిధ పలాజోలు, చిన్న పియాజ్జాల(palazzos and smaller piazzas) ప్రదర్శనలు అద్భుతంగా ఉంటాయి.
కార్నవాల్ డి క్యూబెక్, కెనడా
క్యూబెక్ సిటీ (Quebec City)లో జరిగే కార్నవాల్ డి క్యూబెక్(Carnaval de Québec) ఫెస్టివల్ చాలా ఫేమస్. 1894లో ప్రారంభమైన అతి పురాతన వేడుకల్లో అతిపెద్ద శీతాకాలపు కార్నివాల్ ఒకటి. ఇది ఇప్పటికే 2024 ఫిబ్రవరి 7న ప్రారంభమైంది. కాగా 2025 ఫిబ్రవవరి 16 వరకు జరుగుతుంది. సందర్శకులు మంచు స్నానాలు ( snow baths), నైట్ పరేడ్స్, ఐస్ కెనాన్ రేసులు (ice canoe races), డ్యాన్స్ పార్టీల్లో ఎప్పుడైనా పాల్గొనవచ్చు. ఇది శీతాకాలపు ఉత్సాహభరితమైన వేడుకగా ప్రపంచ ప్రజలను ఆకట్టుకుంటోంది. దీనిని చూడటానికి అనేకమంది పర్యాటకులు వచ్చి వేడుకల్లో పాల్గొంటారు.
సెయింట్ మోరిట్జ్ స్నో పోలో.. స్విడ్జర్లాండ్
సెయింట్(St. Moritz )లోని ఘనీభవించిన సరస్సుపై సెట్ చేయబడింది మోరిట్జ్. ఈ ఆకర్షణీయమైన ఈవెంట్ పోలోకు చెందిన థ్రిల్‌తో ఉన్నత సమాజపు గాంభీర్యంతో మిళితం చేస్తుంది. 40వ స్నో పోలో ప్రపంచ కప్ 2025 జనవరి 24 నుంచి 26 వరకు జరుగుతుంది. సందర్శకులు పోలో మ్యాచ్‌లు, గౌర్మెట్ డైనింగ్ అండ్ స్విప్ ఆల్ప్స్ తో చుట్టుముట్టబడిన అద్భుతమైన సెట్టింగ్‌గా ఈ క్రీడలు ఆకట్టుకుంటాయి.
నార్తర్న్ లైట్స్ ఫెస్టివల్, ఐస్లాండ్
ఐస్‌లాండ్(Iceland)లో, శీతాకాలం మ్యాజికల్ అరోరాస్(magical auroras)ను చూసేందుకు అనువైన సమయం. నార్తర్న్ లైట్స్ ఫెస్టివల్ సాంస్కృతిక, కళాత్మక కార్యక్రమాలతో ఈ సహజమైన అద్భుతాన్ని సృష్టిస్తుంది. రెక్జావిక్(Reykjavík )లోని వింటర్ లైట్స్ ఫెస్టివల్ 2025 ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాలలో లైట్ల టూర్స్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్స్, ప్రత్యక్ష ప్రదర్శనలు, ఐస్లాండిక్ జానపద కథల ప్రదర్శనలు ఉంటాయి. ఇవి నాటకీయ ఐస్లాండిక్ ప్రకృతి దృశ్యాలకు వ్యతిరేకంగా ఉత్కంఠభరితమైన అనుభవాలను అందిస్తాయి.
హోల్మెన్ కోలెన్ స్కీ ఫెస్టివల్, నార్వే
ఓస్లోకు చెందిన హోల్మెన్ కోలెన్ స్కీ ఫెస్టివల్ (Holmenkollen Ski Festival) వరల్డ్ వైడ్‌గా అత్యంత పురాతనమైన, ప్రతిష్టాత్మకమైన స్కీయింగ్ ఈవెంట్లలో(skiing events)లో ఒకటి. 2025 మార్చి 12 నుంచి 16 వరకు షెడ్యూల్ చేయబడింది. ఇందులో స్కీ జంపింగ్, క్రాస్ కంట్రీ రేస్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి. స్కీయర్స్ సవాళ్లతో కూడిన ఛాలెంజ్‌లను ఛేదించేటప్పుడు ప్రేక్షకులు పెద్దగా హర్షధ్వానాలు చేయడం హైలెట్‌గా ఉంటుంది.
ఆమ్‌స్టర్ డ్యామ్ లైట్ ఫెస్టివల్, నెదర్లాండ్
ఆమ్‌స్టర్‌డ్యామ్ (Amsterdam) లైట్ ఫెస్టివల్ చలికాలపు రాత్రులను మరింత ప్రకాశవంతం చేసే అద్భుతమైన పండుగ. తప్పక చూసి తీరాల్సిన వేడుకగా నిపుణులు చెబుతుంటారు. ఈ కళాత్మక పండుగ ఆమ్‌స్టర్‌డ్యామ్ కాలువలు, వీధులను అద్భుతమైన లైట్ ఇన్‌స్టాలేషన్‌లతో అందంగా మారుస్తుంది. ఇది 2024 నవంబర్‌లో ప్రారంభమైంది. కాగా 2025 జనవరి 19 వరకు కొనసాగుతుంది. సందర్శకులు కెనాల్ యాక్టివిటీస్, వాకింగ్ టూర్స్, ఇంటరాక్టివ్ ఎగ్జిబిట్స్ ద్వారా ప్రకాశవంతమైన కళాకృతులను అన్వేషించవచ్చు. ఆమ్‌స్టర్‌డ్యామ్ కు సంబంధించిన ఐకానిక్ కెనాల్స్‌కు చెందిన పూర్తిగా భిన్నమైన ఆకట్టుకునే భాగాన్ని ఈ సందర్భంగా కళాకృతులుగా ప్రదర్శిస్తారు.
రొవానెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్, ఫిన్‌లాండ్
శాంతా క్లాజ్ (Santa Claus) అఫీషియల్ హోమ్‌టౌన్ రొవానెమి (rovaniemi)క్రిస్మస్ వేడుకలకు ఒక మేజికల్ డెస్టినేషన్‌గా ఉంది. సందర్శకులు శాంతా క్లాజ్‌ను కలుసుకోవచ్చు. అతని గ్రామంలో షికారు చేయవచ్చు. రైన్డీర్ స్లిఘ్ సవారీలను ఆస్వాదించవచ్చు. (enjoy reindeer sleigh rides), అలాగే నార్తెర్న్ లైట్స్‌ను వీక్షించవచ్చు. ఈ వేడుకలు డిసెంబర్‌లో ప్రజలను ఆకట్టుకోవడంతోపాటు మరుపురాని మధురానుభూతిని కలిగిస్తాయి. రోవానీమిని సందర్శించడానికి డిసెంబర్ సరైన సమయం.
రియో కార్నివాల్, బ్రెజిల్
రియో కార్నివాల్ (The Rio Carnival ) 18వ శతాబ్దానికి చెందిన పోర్చుగీస్ వలస వాదుల(Portuguese colonists) నుంచి డెవలప్ అయిన ఫెస్టివల్. ఈ సంవత్సరం, రియో కార్నివాల్ ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. కాగా 2025 మార్చి 8 వరకు జరుగుతుంది. ఇక్కడి ముఖ్యమైన ఫెస్టివల్ యాక్టివిటీస్‌లో సాంబడ్రోమ్ పరేడ్, స్ట్రీట్ పార్టీస్(blocos de rua), సాంబా మ్యూజిక్ అండ్ డ్యాన్సింగ్, గ్లామరస్ కార్నివాల్ బాల్స్ ఉన్నాయి. ఇది అత్యంత ఆకర్షణీయమైన రంగుల పండుగగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది.
భారతదేశంలో వింటర్ ఫెస్టివల్స్..
లోహ్రీ : ఇది జనవరి 13న ఉత్తర భారత దేశంలో జరుపుకునే పంజాబీ జానపద పండుగ. వాస్తవానికి ఇది శీతాకాలపు ముగింపును సూచిస్తుంది. ఒక విధంగా ఇది పంటల పండుగ కూడా. భోగి మంటలు, జానపద నృత్యాలు, మక్కీకి రోటి, సర్సన్ కా సాగ్ వంటి సంప్రదాయ రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధి.
మకర సంక్రాంతి : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ముఖ్యమైన శీతాకాలపు వ్యవసాయ పండుగగా ప్రసిద్ధి. ఇతర రాష్ట్రాల్లో దీనిని పొంగల్ పేరిట జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడి పందేలు, పిండివంటలు ఈ ఫెస్టివల్ ప్రత్యేకతగా నిలుస్తాయి. హరిదాసు కీర్తనలు, గాలిపటాలు, బసవన్న చిందులు, భోగి మంటలతో ప్రారంభమయ్యే ఈ పండుగ సరదాలు, సంతోషాలకు నెలవు. గుజరాత్ కైట్ ఫెస్టివల్, గోవా కార్నివాల్, అలాగే దసరా, దీపావళి, క్రిస్మస్ వంటివి ఇండియాలో జరుపుకునే శీతాకాలపు పండుగలుగా ప్రసిద్ధి. ఇవేకాకుండా ఆయా గ్రామాల్లో స్థానిక ప్రాధాన్యతలను బట్టి జరుపుకునే గ్రామ దేవత పండుగలు కూడా కొన్నిచోట్ల ఉంటాయి.
Read More..
Christmas: క్రిస్మస్‌కు ఇంటికెళ్లని వారు పండుగను ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోండి..!