- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ కల్చర్ ను, కాపాడేందుకు అంబాసిడర్లుగా కళాకారుణిలు పని చేయాలి
దిశ, రవీంద్రభారతి : తెలంగాణ కల్చర్ ను, వారసత్వాన్ని కాపాడేందుకు బ్రాండ్ అంబాసిడర్లుగా కళాకారుణి లు పని చేయాలని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్న సాయి నృత్య డాన్స్ ను ఆయన అభినందించారు. పాశ్చాత్య, సంస్కృతి విస్తరిస్తున్న నేటి కాలంలో మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతుండడం అభినందనీయమన్నారు. సాయి నృత్య డాన్స్ అకాడమీ బృందం సోమవారం రాత్రి బిర్లా సైన్స్ మ్యూజియం ఆడిటోరియంలో ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కళాకారుణిల ప్రదర్శనలను తిలకించిన వారు వారి అద్భుత ప్రతిభను అభినందించారు. మధుయాష్కి మాట్లాడుతూ.. సాయినృత్య అకాడమీ 30 ఏళ్లుగా అమెరికాలో భారతీయ కళలను, సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేసేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అమెరికాలోనే ప్రావీణ్యం పొందిన కళాకారిణులతో భారతదేశంలోని ఐదు ప్రధాన నగరాలలో పర్యటిస్తూ, భారతీయ కళలను ప్రదర్శిస్తుండడం మంచి పరిణామం అన్నారు. వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకారమందుతుందన్నారు. కార్యక్రమంలో అకాడమీ గురువు సౌమ్య శ్రీధర్, శాలిని శ్రీనివాస్, ప్యాడి శర్మ, సింగర్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.