అటవీ సాగు భూములకు బ్యాంకు రుణాలు ఇవ్వాలి

by Sridhar Babu |
అటవీ సాగు భూములకు బ్యాంకు రుణాలు ఇవ్వాలి
X

దిశ, వేమనపల్లి : అటవీ సాగు భూములపై అటవీశాఖ అధికారుల పెత్తనాన్ని అరికట్టాలని, బ్యాంకు రుణాలు ఇవ్వాలని ఆదివాసీ గిరిజన సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తకి సోమవారం వినతి పత్రం అందజేశారు. పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఉన్నప్పటికీ ఆ భూములపై అటవీశాఖ అధికారులు పెత్తనం చేయడం సరికాదన్నారు. వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామ ఆదివాసీ పోడు పట్టా భూములలో బోర్లు వేసుకోవద్ధని ఆంక్షలు విధించడం సరికాదని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్మ పున్నం అన్నారు.

హక్కు పత్రాలున్న సాగు భూములకు బ్యాంక్ రుణాలు ఇవ్వకపోవడంతో పోడు రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసుకోవాల్సి వస్తుందన్నారు. కావున హక్కుపత్రాలు ఉన్న ప్రతి ఎకరాకు బ్యాంక్ రుణాలు ఇవ్వాలని కోరారు. హక్కుపాత్రలు, సర్వే చేయని గ్రామాలను సర్వే చేయాలని కోరారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కొమరెల్లి మొండి, జంపం మొండి, మంచాల రాజం, రెడ్డి కిరణ్, పెద్దల పర్వతాలు, కోమరెల్లి సాగర్, అంజన్న, మంచాల శ్రీనివాస్, కొమరేళ్లి తిరుపతి, బట్టు మధునయ్య పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed