- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాక్టర్ దొంగలు అరెస్ట్
దిశ, కూసుమంచి : ట్రాక్టర్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాక్టర్లు దొంగతనాలు చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద రెండు ట్రాక్టర్ ఇంజిన్లు, 7 ట్రక్కులను స్వాధీనపరచుకున్నట్లు కూసుమంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ సంజీవ్, ఎస్సై నాగరాజు తెలిపారు. సోమవారం కూసుమంచి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కూసుమంచి శివారులో గల క్రషర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం కొక్కిరేణి గ్రామానికి చెందిన నూకా వీరబాబు, దాసరి నాగరాజు, దేవర శ్రీధర్ రెండు ట్రాక్టర్లు వేసుకొని వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి పరిశీలించగా వారి వద్ద దొంగిలించిన రెండు ట్రక్కులను, రెండు ట్రాక్టర్ ఇంజన్లను పట్టుకున్నారు.
వారిని విచారించగా కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐదు ట్రక్కులను దొంగతనం చేశారని తెలిపారు. వారు దొంగతనం చేసిన ట్రక్కులను కూసుమంచి మండలం చేగొమ్మకు చెందిన బొల్లం సైదులు, నేలపట్ల గ్రామానికి చెందిన నూకల చిన్న సైదుకు అమ్ముతున్నట్లు తెలిపారు. ముగ్గురు కలిసి పథకం ప్రకారం ట్రాక్టర్ ట్రక్కులను దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు. బొల్లం సైదులు, నూకల చిన్న సైదులు కూడా ట్రక్కులు తీసుకున్నట్లు నేరం ఒప్పుకున్నారు. వారు దొంగతనం చేసిన ఒక్కొక్క ట్రక్కును 60 వేలకు అమ్మారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్టు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కూసుమంచి ఎస్ఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ పి.వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ శ్రీశైలం, గోపి, హోంగార్డ్ రాంబాబు, రమేష్ లను కూసుమంచి సీఐ సంజీవ్ అభినందించి రివార్డ్ ను అందించారు. ఈ సమావేశంలో తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్, నెలకొండపల్లి ఎస్సై సంతోష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.