Asaduddin: ఎంఐఎం MP అసదుద్దీన్ ఒవైసీకి BIG షాక్

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-23 14:20:13.0  )
Asaduddin: ఎంఐఎం MP అసదుద్దీన్ ఒవైసీకి BIG షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంఐఎం(MIM) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi)కి బిగ్ షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ(Lok Sabha)లో పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేశారని నోటీసుల్లో పేర్కొంది. జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందిన తర్వాత పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం అనంతరం అసదుద్దీన్ లోక్‌సభలో ‘జై పాలస్తీనా.. జై భీమ్.. జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగి అధికార పక్షం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ సభ్యులకు సర్ది చెప్పినా అధికార పక్షం సభ్యులు ఆందోళన చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఐదోసారి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ఒవైసీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి మాధవి లతను ఓడించారు.


Read More..

MLC Kavitha : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ నడిపిస్తోంది : ఎమ్మెల్సీ కవిత

Advertisement

Next Story

Most Viewed