- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2047 నాటికి శక్తి శాల్ దేశంగా భారత్ : కిషన్రెడ్డి
దిశ, చార్మినార్ : ప్రపంచంలోనే ఐదవ స్థానంలో ఉన్న భారత్ 2047 నాటికి శక్తి శాల్ దేశంగా నెంబర్ వన్ స్థానంలో ఉంటామని కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మన దేశంలో యువ జనాభా ఎక్కువగా ఉందని, మన మేధస్సుతో ప్రపంచాన్ని శాసించే విశ్వాసం ఉందన్నారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరిగే ఈ ఉద్యోగ మేళాలో ప్రధాని మోడీ పర్చువల్ గా ప్రారంభించారని చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని, ఇప్పటి వరకు 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందన్నారు. పాతబస్తీ చాంద్రాయణగుట్ట సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్లో రోజ్గార్ మేళాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు. ఒక్క చాంద్రాయణగుట్ట సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్ లోనే 5260 నియామకపత్రాలను ఉద్యోగులకు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… దేశ సేవలో యువతను భాగస్వామ్యం చేసేలా వారికి ఉద్యోగాలను కల్పించేలా కేంద్ర ప్రభుత్వం రోజ్ గార్ మేళా నిర్వహిస్తుందన్నారు. యువతకు ఉద్యోగ కల్పన కోసం ఉద్దేశించిన ఈ మేళాల్లో ఇది 11వ దని, ఇప్పటి వరకు 10 మేళాల్లో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సుమారు 71 వేల మందికి ఇవాళ నియామక పత్రాలను అందజేస్తున్నారన్నారు.
రికమండేషన్లకు తలొగ్గకుండా ప్రతిభ కలిగిన వారికే ఉద్యోగాలు కల్పించామన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖలో సుమారు 4 లక్షల ఉద్యోగులు ఉన్నారని రానున్న రోజుల్లో మరికొన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని చెప్పారు. మన దేశంలో యువ జనాభా ఎక్కువగా ఉందన్నారు. మన మేధఘస్సుతో ప్రపంచాన్ని శాసించే విశ్వాసం ఉందన్నారు. దేశ సేవలో యువతను భాగస్వామ్యం చేసేలా వారికి ఉద్యోగాలను కల్పించేలా కేంద్ర ప్రభుత్వం రోజ్ గార్ మేళా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ డిఐజిపి ఉదయ్ భాస్కర్ భిల్లా, అసిస్టెంట్ కమాండెంట్ ఎం హెచ్ ఖోబ్రగాడే, డిప్యూటీ కమాండెంట్ ధృవ్ నారాయణ్, ఇన్స్పెక్టర్ జి.కె గుప్త తదితరులు పాల్గొన్నారు.