- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి : మంత్రి ఉత్తమ్
దిశ,సూర్యాపేట కలెక్టరేట్ : జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.సూర్యాపేట జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి అధికారులతో వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముత్యాల బ్రాంచ్ కెనాల్ జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ కొరకు కొత్త పైపులైన్స్, పంప్ హౌస్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. నవోదయ ఉద్యానం కొరకు గడ్డి పల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో స్థల సేకరణ కొరకు పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
అగ్రికల్చరల్ యూనివర్సిటీ కొరకు మఠంపల్లి మండలంలో సుమారుగా 100 ఎకరాలు గుర్తించడం జరిగిందని మంగళవారం స్థల పరిశీలన కొరకు టీం ను పంపుతున్నట్లు కలెక్టర్ మంత్రికి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కొరకు మ్యాపింగ్, ఆర్కిటెక్ వంటి పనులు ఏడబ్ల్యుఐడీసీ వారి ద్వారా జరుగుతున్నాయని తెలిపారు అనంతరం ఆర్ అండ్ బి ఈఈ సీతారామయ్య మాట్లాడుతూ హుజూర్నగర్ నియోజకవర్గంలో 10 పనులు, కోదాడలో ఆరు పనులు చేపట్టినట్లు తెలిపారు.
హుజూర్నగర్ మండలంలో క్రిస్టియన్ గ్రౌండ్ అప్లికేషన్ ఆఫ్ టౌన్ హాల్, మేళ్లచెరువులోని కమ్యూనిటీ హాల్ , రామాపురం లోనే కమ్యూనిటీ హాల్ చింతలపాలెం లో ఎంపీడీవో కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్మాణం కొరకు అలాగే పాలకీడులో తాసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్మాణం కొరకు, మినీ స్పోర్ట్స్ స్టేడియం కొరకు టెండర్లు పిలిచినట్లు మంత్రి కి తెలిపారు కోదాడలో కమిటీ హాల్ కోదాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించడం జరిగిందని త్వరలోనే టెండర్లు పూర్తి చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి నెలలో మొదలుకానున్న పెద్దగట్టు జాతర చేపడుతున్న కార్యక్రమాలపై మంత్రి కలెక్టరునువివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతరకు సంబందించిన శాఖలు అన్ని ఏర్పాట్లు చూడాలని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ పి. రాంబాబు, ఆర్డీవో కోదాడ సూర్యనారాయణ, ఈఈ ఇరిగేషన్ రామ్ కిషన్, సీపీఓ ఎల్ కిషన్ ,డి ఆర్ డి ఓ వివి అప్పారావు, డీటీడీఓ శంకర్ ,డిఇఓ అశోక్ ,ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.