- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పదేళ్లు జైలు
దిశ, కరీంనగర్ లీగల్ : మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి తన వెంట తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన నేరంలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకటేష్ సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. కొత్తపెల్లి మండలం రేకుర్తి గ్రామానికి చెందిన కుంచం రవి ఓ మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి తన వెంట 2021సెప్టెంబర్ 20న తీసుకొని వెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మూడవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేయగా సీఐ విజ్ఞానరావు దర్యాప్తు జరిపి అనంతరం కోర్టులో చార్జి షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శరత్ సాక్ష్యులను కోర్టులో ప్రవేశపెట్టి విచారించారు. కాగా కేసు నిరూపణ కావడంతో న్యాయమూర్తి నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూతీర్పు వెలువరించారు.