అంకాపూర్ లో 9 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

by Sridhar Babu |
అంకాపూర్ లో 9 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల కోళ్ల ఫారం లో మంగళవారం రాత్రి పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి తొమ్మిది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ ఇన్చార్జి సీపీ సింధు శర్మ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సీఐ అంజయ్య సమక్షంలో టాస్క్ఫోర్స్ సీసీఎస్ సిబ్బంది ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో పేకాట స్థావరంపై పక్కా సమాచారం మేరకు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 9 మంది పేకాట రాయుళ్లను పట్టుకొని వారి వద్ద నుండి 9 సెల్ ఫోన్ లను, 22,750 రూపాయల నగదును టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed