Netanyahu: అప్పటి వరకు కాల్పుల విరమణ లేదు.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

by vinod kumar |
Netanyahu: అప్పటి వరకు కాల్పుల విరమణ లేదు.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రానున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Nethanyahu) కీలక ప్రకటన చేశారు. మొదటి దశలో హమాస్ చెర నుంచి విడుదల కానున్న 33 మంది బందీల పేర్లు వెల్లడించాలని అప్పటి వరకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లబోమని తెలిపారు. ‘ఇరు పక్షాలు అంగీకరించినట్లుగా రిలీజ్ చేయబడే బందీల జాబితా బహిర్గతం చేసే వరకు ఒప్పందాన్ని కొనసాగించలేము. అగ్రిమెంట్ ఉల్లంఘిస్తే ఇజ్రాయెల్ సహించబోదు. పూర్తి బాధ్యత హమాస్‌పైనే ఉంది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా, ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందని ఖతార్ వెల్లడించిన కొద్ది గంటల్లోనే నెతన్యాహు పై వ్యాఖ్యలు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.



Next Story

Most Viewed