సీఎస్ శాంతి కుమారికి కీలక బాధ్యతలు

by Kavya |
సీఎస్ శాంతి కుమారికి కీలక బాధ్యతలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా కె. రామకృష్ణారావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కొత్త సీఎస్ నియామకం కోసం ప్రభుత్వం కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. సీనియారిటీ జాబితాలో రామకృష్ణారావుతో పాటు మరో ఆరుగురు అధికారులు పోటీలో ఉండగా, వారి సమర్థత, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావును సీఎస్‌గా ఎంపిక చేసింది.

మరోవైపు, సీఎస్ పదవి నుంచి విరమణ తర్వాత శాంతి కుమారికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) వైస్ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, ఆమెకు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్‌ (డీజీ)గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది.



Next Story

Most Viewed