- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ ఇద్దరికీ CM అయ్యే అర్హత ఉంది.. MLA కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

దిశ నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అదనపు బ్లాక్ భవన నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల నాయకత్వంలో జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటున్నామని తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తాము చేస్తున్న అభివృద్ధిని వివరిస్తామని చెప్పారు. ఆయన కళ్లకు కట్టినట్లు చూపించే బాధ్యత తమదే అన్నారు. రానున్న మూడేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తోన్న ఆదరణ చూసి కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. మళ్లీ బీఆర్ఎస్‌ను నమ్మే పరిస్థితితుల్లో తెలంగాణ ప్రజలు లేరని.. వందకు వందశాతం మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కీలక ప్రకటన చేశారు.