- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Viral video : అందరూ మంచోళ్లు కాదు.. అందరూ చెడ్డోళ్లు కూడా కాదు..!! ఎందుకంటే..

దిశ, ఫీచర్స్ : మంచితనం మంచిదే కానీ.. మంచి అనే ముసుగు తొడిగి ముంచేవారు కూడా ఉంటారు ఈ సమాజంలో.. అట్లనే కొందరు చెడ్డవాళ్లని ఎవరో చెప్పినంత మాత్రానా వాళ్లు చెడ్డవాళ్లు కాకపోవచ్చు. అందుకే ఎటువంటి ఆధారం గానీ, అనుభవం గానీ లేకుండా గుడ్డిగా ఏదీ నమ్మాల్సిన అవసరం లేదంటారు నిపుణులు. అటువంటి సిచువేషన్(Situation)ను గుర్తుచేసే వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. అది చూస్తే నిజంగా నిజమేనా! అని ఆశ్చర్యపోవాల్సిందే ఎవరైనా.. ఇంతకీ ఏం జరిగిందంటే..
వైరల్ సమాచారం(Viral information) ప్రకారం.. అదో నీటి మడుగు బహుశా ఏ చెరువు తీరమో, నది తీరమో అయుంటుంది. అక్కడి నీటి ప్రవాహానికి చేపలు ఎదురీది ఒడ్డువైపు కొట్టుకొచ్చినట్టున్నాయి. అయితే ఇలా వచ్చిన చేపలు కొంగలు, కాకులు, గద్దలు వంటి పక్షులకు కనిస్తే, ఇక వాటికి పండుగే. ఎందుకంటే చేపలను ఆహారంగా భుజిస్తాయి. కానీ వైరల్ వీడియో ప్రకారం.. ఒక కొంగ(stork) మాత్రం నీటిలో ఒడ్డువైపు కొట్టుకొచ్చి, సరైన నీరు అందక నిస్సాహాయ స్థితిలో ఉన్న ఒక చేప(fish)ను నోటితో పట్టుకెళ్లి నీటిలోపల వదిలేసి ప్రాణం కాపాడుతుంది. అంతలోనే మరో కాకి వచ్చి కూడా మరో చేప విషయంలో అట్లనే చేసింది. నిజానికి ఇవి రెండు చేపలను తినాల్సింది పోయి వాటిమీద ప్రేమతో, దయతో నీటిలోకి వదిలి ప్రాణాలు కాపాడాయి. ‘Not everyone is bad’ అనే క్యాప్షన్‌తో ఇన్ స్టా హ్యాండిల్లో ఈ వీడియో షేర్ చేయగా నెటిజన్లు క్యూరియాసిటీతో స్పందిస్తున్నారు. ‘Everyone not good, everyone not bad’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.