Farmers: ఫిబ్రవరి14న రైతులతో సమావేశం.. వెల్లడించిన కేంద్రం

by vinod kumar |
Farmers: ఫిబ్రవరి14న రైతులతో సమావేశం.. వెల్లడించిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: రైతుల డిమాండ్లపై చర్చించేందుకు ఫిబ్రవరి 14న వారితో సమావేశం కానున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రియా రంజన్ వెల్లడించారు. రంజన్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పంజాబ్-హర్యానా బార్డర్ ఖానౌరీ సరిహద్దులో ఆమరణ దీక్ష చేస్తు్న్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్‌తో శనివారం భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు. దల్లేవాల్ ఆరోగ్యం క్షీణించడాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని పంపినట్టు చెప్పారు. వచ్చే నెల 14న సమస్యలపై చర్చించేందుకు రైతులతో భేటీ అవుతామని స్పష్టం చేశారు. అయితే నిరాహార దీక్ష విరమించాలని దల్లేవాల్‌కు అధికారులు విజ్ఞప్తి చేసినా ఆయన నిరాకరించినట్టు తెలుస్తోంది.

Next Story