- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bangladesh: బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి ఆ పదాలు తొలగించాలి.. యూనస్ ప్రభుత్వానికి నివేదిక

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి లౌకికవాదం (Secularism), సామ్యవాదం (Socialism), జాతీయవాదం (Nationalism) పదాలు తొలగించాలని తాత్కాలిక ప్రభుత్వాదినేత యూనస్ (Younus) నియమించిన రాజ్యాంగ సంస్కరణల కమిషన్ సిఫార్సు చేసింది. ఈ మేరకు ప్రొఫెసర్ అలీ రియాజ్ నేతృత్వంలోని కమిషన్ తాజాగా యూనస్‌కు నివేదికను అందజేసింది. కాన్‌స్టిట్యూషన్ నుంచి సెక్యులరిజం, నేషనలిజం, సోషలిజం పదాలను తీసివేయాలని ప్రతిపాదించింది. అలాలే ఉభయ సభల ఏర్పాటుకు సైతం కమిషన్ సిఫార్సు చేసింది. కాగా, యూనస్ ప్రభుత్వ ఏర్పడిన తర్వాత బాధ్యతలు చపట్టిన బంగ్లాదేశ్ అటార్నీ జనరల్ ఎండీ అసదుజ్జమాన్ దేశ రాజ్యాంగం నుంచి ఈ మూడు పదాలను తొలగించాలని పిలుపునిచ్చారు. 90శాతం ముస్లిం జనాభా ఉన్న దేశంలో ఇవి అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే కమిషన్ సైతం సిఫార్సు చేయడం గమనార్హం. దీంతో యూనస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.