బీబీనగర్ తహశీల్దార్ సస్పెండ్

by Naveena |
బీబీనగర్ తహశీల్దార్ సస్పెండ్
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : బీబీనగర్ తహశీల్దార్ శ్రీధర్ ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు సస్పెండ్ చేశారు. శుక్రవారం ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. బీబీనగర్ మండలం పడమటి సోమారం గ్రామంలో ఫీల్డ్ లో ప్లాట్లు ఉన్నప్పటికి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా పాస్ బుక్ డేటా కరెక్షన్ ద్వారా పాస్ బుక్ జనరేషన్ కు బాధ్యులైన తహశీల్దార్ ను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు తప్పిదాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Next Story

Most Viewed