- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మరో ఇవేంట్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిసిన భారత్

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల భారత క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి ఛాంపియన్స్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందు భారత జట్టు మరో ఇవేంట్‌లో ప్రపంచ ఛాంపియన్ (World champion)గా నిలిచింది. పాట్నాలోని పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ (Pataliputra Sports Complex)లో ఈరోజు జరిగిన ISTAF సెపక్ తక్రా ప్రపంచ కప్ (Sepak Takraw World Cup) ఫైనల్‌లో జపాన్‌ను ఓడించి భారత పురుషుల జట్టు (Indian Men's Team) బంగారు పతకాన్ని గెలుచుకుంది. దాదాపు ఆరు రోజుల పాటు జరిగిన ఈ మెగా-స్పోర్ట్స్ ఈవెంట్ పాట్నాలోని పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ముగిసింది. మహిళల విభాగంలో, వియత్నాంతో జరిగిన సెమీ-ఫైనల్లో ఓడిపోయిన భారత జట్టు కాంస్యం గెలుచుకుంది. థాయిలాండ్ మహిళల జట్టు స్వర్ణం గెలుచుకోగా, వియత్నాం ఫైనల్ మ్యాచ్‌లో రజత పతకాన్ని అందుకుంది.
అలాగే ఈ టోర్నీలో భారత పురుషుల జట్టు భారీ విజయాలతో ఫైనల్ చేరింది. మొదటి సెమీఫైనల్‌లో, జపాన్ సింగపూర్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. పురుషుల రెగ్యులర్ విభాగంలో ఇరాన్, సింగపూర్ సంయుక్తంగా కాంస్య పతకాన్ని సాధించాయి. గత ప్రపంచ కప్‌తో పోలిస్తే పురుషులు, మహిళల జట్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది, గత సెపక్ తక్రా ప్రపంచ కప్‌లో ఐదు పతకాలు సాధించగా .. ఈ సంవత్సరం భారత జట్టు మొత్తం ఏడు పతకాలను సాధించింది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, క్రీడా మంత్రి సురేంద్ర మెహతా విజేతలు, రన్నరప్ జట్లకు పతకాలు, విజేత ట్రోఫీలను అందజేశారు. ఇదిలా ఉంటే బీహార్ తొలిసారిగా సెపక్ తక్రా ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చింది.