- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హిందువుల పండుగల్లో సందేశంతో పాటు సైన్స్ ఉంటది.. కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ(BJP Telangana) అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం(BJP State Office)లో ఉగాది వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ముందుగా తెలుగు ప్రజలకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. హిందువుల ప్రతి పండుగలో సందేశంతో పాటు సైన్స్ కూడా ఉంటుందని చెప్పారు. కులాలకు అతీతంగా సామూహికంగా ప్రజలందరూ కలిసి ఉండాలనే పండుగలు మనకు సూచిస్తాయన అన్నారు. రాష్ట్రం మరియు దేశం మరింత సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షించారు.
ప్రధాని మోడీ(PM Modi) నాయకత్వంలో భారత్ మరింత పురోగమించడంతో పాటు ప్రపంచంలో మన దేశ ఖ్యాతి మరింత పెరగాలని అభిప్రాయపడ్డారు. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో బూత్ మరియు మండల, జిల్లా కమిటీలను పూర్తి చేసుకున్నాం.. ఇక అతి త్వరలోనే రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీలు త్వరలోనే ఏర్పాటు అవుతాయని కీలక ప్రకటన చేశారు. కొత్త సంవత్సరంలో అందరు బాగుండాలి.. మనతోపాటు మన కుటుంబ సభ్యులు, బంధువులు కూడా బాగుండాలి ఆ వెంకటేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అందరూ వీక్షించాలని సూచించారు.